For the best experience use Mini app app on your smartphone
నటుడు శింబు, దర్శకుడు వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అరసన్‌’ సినిమాలో విజయ్‌ సేతుపతి కూడా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లోకి విజయ్‌ సేతుపతికి స్వాగతం పలుకుతూ నిర్మాత కలైపులి ఎస్ థాను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. ఈ సినిమాలో సేతుపతి విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో ఇది విడుదల కానుంది. ఈ చిత్రం ‘వడచెన్నై’ యూనివర్స్‌లో భాగంగా రానుంది.
short by srikrishna / 12:58 pm on 25 Nov
For the best experience use inshorts app on your smartphone