For the best experience use Mini app app on your smartphone
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం పీఎస్‌ఎల్వీ-సీ59ని విజయవంతంగా ప్రయోగించింది. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను ఈ రాకెట్ మోసుకెళ్లింది. సూర్యుడి బాహ్య వాతావరణంపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం ఆ ఉపగ్రహాలు సమన్వయంతో ఓ క్రమపద్ధతిలో భూకక్ష్యలో తిరగనున్నాయి.
short by Srinu Muntha / 05:14 pm on 05 Dec
For the best experience use inshorts app on your smartphone