For the best experience use Mini app app on your smartphone
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు అధికారులకు బెదిరింపు ఇ-మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. ఇ-మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పెట్టారనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు, భారత్‌- పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
short by Srinu / 07:56 pm on 09 May
For the best experience use inshorts app on your smartphone