హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఐరన్ బాక్స్‌లో తరలిస్తున్న రూ.1.55కోట్ల విలువ చేసే బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుడి లగేజి తనిఖీ చేయగా ఐరన్ బాక్సులో 11 గోల్డ్ బార్‌లు బయటపడ్డాయి. పట్టుబడ్డ బంగారం 1196.20 గ్రాములు ఉందని అధికారులు తెలిపారు.
short by
Devender Dapa /
11:22 pm on
16 Nov