For the best experience use Mini app app on your smartphone
గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయలేమని, ఈనెల 23న యథాతథంగా నిర్వహిస్తామని APPSC తెలిపింది. పరీక్షలు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాశాక ఈ మేరకు బదులిచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఉ.10 నుంచి 12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. 92,250 మంది మెయిన్స్‌ పరీక్ష రాయనున్నారు.
short by Devender Dapa / 10:27 pm on 22 Feb
For the best experience use inshorts app on your smartphone