హైదరాబాద్ నార్సింగిలో షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో మంటలు అంటుకున్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పాషా కాలనీలో ఉన్న 2 అంతస్థుల భవనంలో ఉన్న సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని, మంటలు మెట్ల ద్వారా పై అంతస్థుల్లోకి పాకినట్లు అధికారులు తెలిపారు. వాహనాల్లో ఉన్న CNG గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఇంట్లో ఉన్న 70 ఏళ్ల జమీలా, 40 ఏళ్ల సహానా, 7 ఏళ్ల సిజిరాలు పొగతో ఊపిరాడక చనిపోయారు.
short by
Bikshapathi Macherla /
10:35 pm on
28 Feb