విశాఖ మద్దిలపాలెంలోని ఓ కార్ల షోరూమ్‌లో అగ్నిప్రమాదం జరిగి, 2 కార్లు దగ్ధమయ్యాయి. మరో 2 కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. నాలుగు ఫైరింజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. మద్దిలపాలెం నుంచి ఇసుకతోటకు వెళ్లే జాతీయ రహదారి సమీపంలో వంశీ ఫంక్షన్ హాల్ కింద ఈ కార్ల షోరూమ్ ఉంది. ఐదంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు.
short by
Devender Dapa /
11:44 am on
20 Nov