క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డీజీపీ ఆదేశాలతో పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీసు నుంచి తొలగించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ తెలిపారు. శంకరయ్య సమక్షంలోనే YS వివేకా హత్య కేసు నిందితులు ఆధారాలను చెరిపివేశారని గతంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. తన పరువుకు భంగం కలిగించారని CMకు లీగల్ నోటీసులు పంపిన శంకరయ్య.. అసెంబ్లీ వేదికగా క్షమాపణ చెప్పాలని, రూ.45 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
short by
Devender Dapa /
10:52 am on
22 Nov