సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో తాజోద్దీన్ అనే 29 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేశారు. శనివారం నమాజ్ కోసం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరిన తాజోద్దీన్, రాత్రి వరకు ఇంటికి రాలేదు. అయితే అతడిని కొంతమంది బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డయ్యాయి. జామ మసీదు వద్ద అతడి బైక్‌ను పోలీసులు రికవరీ చేశారు. ఆదివారం పాడుబడిన బావిలో మృతదేహం లభ్యమైంది.
short by
Devender Dapa /
11:02 pm on
13 Jul