సౌదీ అరేబియాలో యాత్రికులతో వెళ్తోన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో కనీసం 42 మంది సజీవదహనం అయ్యారని, వీరంతా భారతీయులేనని నివేదికలు తెలిపాయి. మృతుల్లో హైదరాబాద్‌లోని మల్లేపల్లి, బజార్‌ఘాట్‌కు చెందిన 16 మంది ఉన్నట్లు సమాచారం. వీరు మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా, సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలిసింది. ఇప్పటి వరకు మృతుల వివరాలు తెలియరాలేదు.
short by
srikrishna /
10:17 am on
17 Nov