సౌదీ అరేబియాలో సోమవారం జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన 45 మంది హైదరాబాదీలకు తెలంగాణ మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం, అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి ఇద్దరు చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
short by
Srinu /
06:21 pm on
17 Nov