‘పుష్ప 2’ ప్రీమియర్ షో వేళ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు, BRS MLAలు పరామర్శించారు. “సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. గురుకులాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను సీఎం రేవంత్ పరామర్శించలేదు. చట్టం అందరికీ సమానమేనన్న సీఎం, ఓ సర్పంచి మృతికి కారణమైన తన తమ్ముడిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు,” అని అన్నారు.
short by
Devender Dapa /
06:40 pm on
26 Dec