For the best experience use Mini app app on your smartphone
స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరుగుతున్న రేసింగ్‌లో నటుడు అజిత్ కుమార్‌ కారు ప్రమాదానికి గురైంది. రేస్‌ సమయంలో అడ్డంగా వచ్చిన మరో కారును తప్పించే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అజిత్‌ వాహనం ట్రాక్‌పై పల్టీలు కొట్టగా, ఆయన సురక్షితంగా బయట పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను అజిత్‌ రేసింగ్‌ టీమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ రేసులో అజిత్ 14వ స్థానంలో నిలిచాడని ఆయన కుటుంబం తెలిపింది.
short by Srinu Muntha / 12:55 pm on 23 Feb
For the best experience use inshorts app on your smartphone