తన ప్రేమికుడు సచిన్ మీనాను వివాహం చేసుకోవడానికి పాకిస్థాన్ నుంచి భారత్‌కి వచ్చి వైరల్ అయిన సీమా హైదర్ ఇకపై పాకిస్థానీ కాదని, ఇప్పుడు భారతీయురాలని ఆమె తరఫు న్యాయవాది ఏపీ సింగ్ అన్నారు. సీమా ఒక భారతీయుడిని పెళ్లి చేసుకోవడంతో పాటు అతడితో కుమార్తెను కన్నందున "కేంద్రం ఆదేశం ఆమెకు వర్తింపజేయకూడదు” అని సింగ్ చెప్పారు. పహల్గాం దాడి తర్వాత పాక్ జాతీయులకు అన్ని రకాల వీసా సేవలను భారత్ రద్దు చేసింది.
short by
srikrishna /
03:47 pm on
25 Apr