తక్కువ ఖర్చులో పెళ్లిళ్లు చేయిస్తామని, కానుకలు కూడా ఇస్తామని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో రిషివంశీ అనే గ్రూప్ రూ.లక్షల్లో వసూలు చేసి పారిపోయింది. పోలీసుల ప్రకారం, సామూహిక వివాహాలు జరిపిస్తామని చెబుతూ సదరు గ్రూప్ సభ్యులు సుమారు 28 జంటల నుంచి రూ.15 వేలు- 40 వేల చొప్పున వసూలు చేశారు. అయితే వధూవరులు ముస్తాబై వారు చెప్పినచోటుకు రాగా మోసపోయినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు పెళ్లిళ్లు చేయించారు.
short by
Devender Dapa /
08:13 pm on
22 Feb