భగవాన్ సత్యసాయి ప్రజల్లోనే దేవుడిని చూశారని, ప్రేమ ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందనేది ఆయన సందేశమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బాబా సందేశం యుగయుగాలపాటు ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణలోనూ శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్‌వ్యూ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
short by
News Telugu /
08:00 am on
24 Nov