For the best experience use Mini app app on your smartphone
హైదరాబాద్‌ హబ్సిగూడలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్రీవైష్ణవి అనే 14ఏళ్ల బాలిక మంగళవారం తెల్లవారుజామున ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సరిగా చదవటం లేదని తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థిని మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
short by Srinu / 12:45 pm on 25 Nov
For the best experience use inshorts app on your smartphone