హాంకాంగ్‌లోని ఏడు బహుళ అంతస్తుల నివాస భవనాల్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 94కి పెరిగింది. మరో 270 మందికి పైగా ఆచూకీ దొరకడం లేదు. ప్రమాదం జరిగిన హౌసింగ్ కాంప్లెక్స్‌ను తై పో జిల్లాలో 1983లో నిర్మించారు. ఇందులో ఒక్కోటి 31 అంతస్తులతో మొత్తం 8 టవర్లు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 4,600 మంది నివసిస్తున్నారు. హాంకాంగ్‌లో ఈ స్థాయిలో అగ్నిప్రమాదం జరగడం 60 ఏళ్లలో ఇదే తొలిసారి.
short by
srikrishna /
09:04 am on
28 Nov