భారత సంతతికి చెందిన బిలియనీర్, హిందుజా గ్రూప్ ఛైర్మన్ 85 ఏళ్ల గోపీచంద్ పరమానంద్ హిందుజా లండన్‌లో కన్నుమూశారు. వ్యాపార వర్గాల్లో ‘జీపీ’గా పేరొందిన ఆయన కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లండన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హిందుజా కుటుంబంలో రెండో తరానికి చెందిన గోపీచంద్ తన అన్న శ్రీచంద్ మరణానంతరం 2023లో హిందుజా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
short by
srikrishna /
04:41 pm on
04 Nov