హైదరాబాద్ శివారుల్లో కొత్తగా 2 ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. వీటిని ఏయే ప్రాంతాల్లో, ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. నగరంలో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘డ్యూ’ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. రాబోయే 5 ఏళ్లలో ఈ సంస్థ 900 మందికి ఉపాధి కల్పించనుందని పేర్కొన్నారు.
short by
Devender Dapa /
07:43 pm on
28 Jan