హైదరాబాద్ తరహాలో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే 29 గ్రామాల పరిధి సరిపోదని సీఎం చంద్రబాబు అన్నారు. 29 గ్రామాలు మాత్రమే ఉంటే.. ఓ మున్సిపాలిటీగా మాత్రమే అమరావతి ఉంటుందన్నారు. గురువారం రాజధాని ప్రాంత రైతులు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలని కోరారు.
short by
Devender Dapa /
11:23 pm on
27 Nov