హైదరాబాద్ బండ్లగూడ PS పరిధిలోని లేక్ వ్యూహిల్స్ ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సమీప ప్రాంతాలను పొగ కమ్మేసినట్లు వీడియోలో కనిపించింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడం గమనించి, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారుల ఆరా తీస్తున్నారు.
short by
Devender Dapa /
11:58 pm on
28 Feb