హైదరాబాద్ గచ్చిబౌలిలో రెండేళ్ల క్రితం 50 గజాల స్థలంలో నిర్మించిన 4 అంతస్తుల భవనం ఓ పక్కకు ఒరిగిన ఘటనలో శ్రీను అనే బిల్డర్‌పై కేసు నమోదైంది. సదరు బిల్డర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భవనం పక్కనే 2 పిల్లర్ గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వ్యవహరించాడని జీహెచ్‌ఎంసీ సిటీ ప్లానర్ వెంకటరమణ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కకు ఒరిగిన భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు.
short by
Srinu Muntha /
10:03 pm on
20 Nov