‘నా టూర్ ఎం.ఎం.కె’ పేరిట ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి లైవ్ కాన్సర్ట్ చేయనున్నారు. మార్చి 22న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఆ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ వివరాలు పంచుకుంటూ ఆయన సోదరుడు, అగ్ర దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ఈ ప్రదర్శనలో ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌లు ఉండాలనేదే తన డిమాండ్ అని రాజమౌళి అన్నారు.
short by
Devender Dapa /
11:57 pm on
28 Feb