హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. ఉద్యోగులు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయం కావడంతో రోడ్లపై రద్దీ నెలకొంది. ముఖ్యంగా మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు బారులు తీరినట్లుగా ఉన్న వీడియోలో వెలుగులోకి వచ్చాయి. మాదాపూర్ ఐకియా అండర్ పాస్ వద్ద వాహనాలు నిదానంగా కదిలాయి.
short by
Devender Dapa /
11:24 pm on
18 Apr