హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో కింగ్స్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు దుకాణదారుల మధ్య వాగ్వాదం జరగ్గా, వారిని అడ్డుకునేందుకు వచ్చిన మరో వ్యక్తి గాలిలోకి 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా కాల్పులు జరిపిన వ్యక్తి వికారాబాద్ జిల్లాలోని మాజీ సర్పంచ్ అని, అతడి వద్ద లైసెన్స్‌డ్ గన్ ఉందన్నారు.
short by
Devender Dapa /
04:22 pm on
29 Mar