ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులను పరిశీలించిన వైద్యులు ఆయనకు కొన్ని సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉండటంతో పవన్ ఈ నెల చివర్లో గానీ, మార్చి మొదటి వారంలో గానీ మరోసారి ఆస్పత్రికి వెళ్లే అవకాశముందని జనసేన పార్టీ తెలిపింది. పవన్ గత కొద్ది రోజులుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.
short by
Srinu Muntha /
07:02 am on
23 Feb