హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయం సౌత్ ఈస్ట్ ఎంట్రెన్స్ దగ్గర ఓ మహిళా ఉద్యోగి కాలు ప్రమాదవశాత్తు గ్రిల్‌లో ఇరుక్కుపోయింది. ఆఫీసు నుంచి ఇంటికెళ్లే సమయంలో ఎంట్రెన్స్ దగ్గర అండర్ వెహికిల్ స్కానర్ గ్రిల్‌లో మహిళా ఉద్యోగి కాలు ఇరుక్కుంది. అక్కడున్న వారు ఎంత ప్రయత్నించినా కాలు బయటకు రాలేదు. దీంతో ఎస్‌పీఎఫ్ సిబ్బంది గ్రిల్‌ను కట్ చేసి మహిళ కాలును బయటకు తీశారు. అప్పటి వరకు ఆ మహిళ అక్కడే కూర్చుండిపోయింది.
short by
Devender Dapa /
10:05 pm on
19 Nov