హైదరాబాద్ గచ్చిబౌలిలో అరెస్టు చేసేందుకు వెళ్లిన సైబరాబాద్ CCS కానిస్టేబుల్ వెంకటరాంరెడ్డిపై దుండగుడు కాల్పులు జరిపాడు. పోలీసుల ప్రకారం, ప్రిజమ్ పబ్‌లో దొంగ 2 రౌండ్లు కాల్పులు జరపగా, ఓ తూటా కానిస్టేబుల్ తొడభాగంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పబ్‌లో ఉన్న బౌన్సర్‌కు కూడా గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన దొంగ మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్‌గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
short by
Devender Dapa /
09:47 pm on
01 Feb