హైదరాబాద్‌లోని చందానగర్‌లో సెంట్రో షాపింగ్ కాంప్లెక్స్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. భారీగా ఎగసిపడుతున్న మంటలు పక్క దుకాణాలకు అంటుకోవడంతో 3 షాపులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ మంటలు చెలరేగినట్లు సమాచారం. ఏడాది క్రితం కూడా ఇదే షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగిందని పలు వార్తా కథనాలు తెలిపాయి.
short by
Srinu /
08:11 pm on
09 May