హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో భారత మాతకు మహా హారతి కార్యక్రమంలో బాణాసంచా పేలి 2 బోట్లు కాలిపోయిన ఘటనలో అదృశ్యమైన 21 ఏళ్ల అజయ్ మృతదేహం మంగళవారం లభ్యమైంది. 45 గంటల పాటు గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించినట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు. దీంతో ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 2కు చేరింది. మంగళవారం ఉదయం గణపతి అనే వ్యక్తి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
short by
Devender Dapa /
10:16 pm on
28 Jan